🏠 www.telanganadailynews.in
Watermark
Newspaper Logo
www.telanganadailynews.in | Date: 17 Jul, 2026 | Page: 1

‘NBK111’ రిలీజ్ డేట్ ఫిక్స్...

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK111 పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా బాలయ్య స్టైలిష్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త స్టైలిష్ అవతారంలో గోపీచంద్ మలినేని చూపించబోతున్నారని గ్లింప్స్ ద్వారానే స్పష్టమైంది. పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘NBK111’ విడుదల తేదీ గురించిన చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ తొలి వారంలోనే విడుదల చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించడంతో మేకర్స్ తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ప్రభాస్ సినిమాతో పోటీ పడకుండా, క్రిస్మస్ హాలిడే సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేస్తే కలెక్షన్లకు మరింత అనుకూలంగా ఉంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు, అనంతరం న్యూ ఇయర్ హాలిడేస్ కలిసి రావడం వల్ల సినిమాకు లాంగ్ రన్ దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
🏠 Home